బీరమయ్య పూర్వచరిత్రపై అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

బీరమయ్య పూర్వచరిత్రపై అధ్యయనం

Oct 18 2026 1:30 AM | Updated on Oct 18 2026 1:30 AM

వాజేడు: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు లొట్టిపిట్ట గండి వద్ద వెలిసిన బీరమయ్య పూర్వచరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు సమ్మక్క– సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ బృందం అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు బృందం సభ్యులు ఇరప ప్రభాకర్‌, గట్టిపెల్లి అర్జున్‌, కాక నవ్య, కొమరం ధనలక్ష్మి శనివారం బీరమయ్య వెలిసిన ప్రదేశానికి చేరుకుని అధ్యయనం మొదలు పెట్టారు. స్థానిక సర్పంచ్‌ చిడెం బాలకృష్ణ, స్థానికులు వాసం ఆనందరావు, యాలం అచ్చయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పద్దం సుధాకర్‌, చంద్రశేఖర్‌, టేకులగూడెం, కృష్ణాపురం గ్రామాల్లోని పెద్ద మనుషులతో కలిసి వెళ్లి బీరమయ్య గుడి ప్రాంతంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ముందుగా గంగమ్మ తల్లికి చీరసారె సమర్పించారు. అనంతరం బీరమయ్య చరిత్రను తెలుసుకునే పనిలో నిమగ్న మయ్యారు. బీరమయ్య పూర్వచరిత్రను తెలుసుకోవడంతో పాటు గుడి ప్రాధాన్యతను సేకరించి బీరమయ్య జాతర నాటికి తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో పుస్తక రూపంలో ప్రచురించనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement