నలుగురు కుమార్తెలు ఉద్యోగులే.. | - | Sakshi
Sakshi News home page

నలుగురు కుమార్తెలు ఉద్యోగులే..

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

● గోగు నగేశ్‌, ఏటూరునాగారం

ఏటూరునాగారం: మాది రైతు కుటుంబం. ఎన్నో కష్టాలు పడి మా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్దచేశారు. ఇంటర్‌ వరకు చదువుకున్నాను. 19 సంవత్సరాలకే జైలు వార్డెన్‌ ఉద్యోగం వచ్చింది. పోలీసులను మావోయిస్టులు చంపుతున్నారని తల్లిదండ్రులు పోలీసులు ఉద్యోగానికి పంపలేదు. నాకు నలుగురు కుమార్తెలు. ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఇంటి వద్ద నేనే ట్యూషన్‌ చెప్పేవాడిని. ఆ తర్వాత నా రెండో కుమార్తె ప్రసన్న లక్ష్మీని డిప్లామా అగ్రిలక్చర్‌ చదివించగా ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. పెద్ద కుమార్తె పద్మ ఏఎన్‌ఎంగా ములుగు ఏరియా ఆస్పత్రిలో థియేటర్‌ అసిస్టెంట్‌గా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తోంది. మూడో కుమార్తె ప్రియాంకకు ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నాలుగో కుమార్తె రజిత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌లో వెటర్నరీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తోంది. నలుగురు కుమార్తైలెనా అధైర్యపడకుండా ప్రయోజకులను చేశా. వారు నా నమ్మకాన్ని నిలబెట్టడం తండ్రిగా ఎంతో సంతృప్తినిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement