ఇద్దరు ఆడపిల్లలూ డాక్టర్లే.. | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆడపిల్లలూ డాక్టర్లే..

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్‌–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో పిడియాట్రిక్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధిలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. చిన్నమ్మాయి మేఘన కూడా తామేమి తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్‌ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్‌ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిలగా భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్‌–రమాదేవి సగర్వంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement