అక్షరమే ఆయుధం! | - | Sakshi
Sakshi News home page

అక్షరమే ఆయుధం!

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

ములుగు: అక్షరమే ఆయుధంలాంటిది. చదువు తెలియని జీవితాలకు అక్షరజ్ఞానంతో కొత్తదారి చూపేందుకు చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేడు(ఆదివారం) పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన 3,597 మంది నిరక్షరాస్యులకు అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన మదింపు పరీక్ష నిర్వహించనున్నారు. 171 గ్రామ పంచాయతీలు, 20 పట్టణ వార్డుల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

100 రోజుల శిక్షణ.. ఇప్పుడు పరీక్ష

15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు ఉల్లాస్‌ విద్యా కేంద్రాల ద్వారా అధికారులు 100 రోజుల పాటు చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అభ్యర్థులు 150 మార్కులకు పరీక్ష రాయనున్నారు. ఉత్తీర్ణులైన వారికి జాతీయ సార్వత్రిక విద్యాపీఠం నుంచి అక్షరాస్యత ధ్రువపత్రం అందజేయనున్నారు.

వాజేడు నుంచి 996 మంది..

జిల్లాలోని మండలాల వారీగా చూస్తే వాజేడు మండలం నుంచి అత్యధికంగా 996 మంది, వెంకటాపురం(కె) నుంచి 719, ఏటూరునాగారం నుంచి 435, మంగపేట నుంచి 421, వెంకటాపురం(ఎం) నుంచి 325 మంది పరీక్షకు హాజరుకానున్నారు. గోవిందరావుపేట 223, కన్నాయిగూడెం 220, ములుగు మండలం నుంచి 115, ములుగు పట్టణం నుంచి 120, తాడ్వాయి నుంచి 23 మంది పరీక్షకు హాజరుకానున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించాం. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, కూర్చునే సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. అభ్యర్థులందరూ పరీక్షకు హాజరయ్యేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అక్షరజ్ఞానం ద్వారా రోజువారీ జీవితంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

– హేమంత్‌ సహదేవరావు, కలెక్టర్‌

‘అమ్మకు అక్షరమాల’తో

నిరక్షరాస్యులకు కొత్త వెలుగు

నేడు జిల్లాలో 3,597 మంది

మహిళలకు పరీక్ష

171 గ్రామ పంచాయతీలు..

20 పట్టణ వార్డుల్లో పరీక్ష కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement