కూతుళ్లు..
నేడు కూతుళ్ల దినోత్సవం (డాటర్స్ డే)
● అమ్మనాన్నల రెక్కల కష్టం.. కూతుళ్ల విజయాల ఆకాశం
● చదువుకోలేదన్న వెలితిని.. పిల్లల చదువుతో తుడిచేసుకున్న తల్లిదండ్రులు
● వారి ఆశలను వమ్ము చేయకుండా నెరవేర్చిన కూతుళ్లు
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురు
కూతురును చూసి గర్వపడుతున్నాం..
హన్మకొండ : నిన్నుచూసి మేము తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్‌ను మార్చే శక్తి అని ధృడంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం.
– గోపు రేణుక–సమ్మిరెడ్డి, హనుమకొండ


