ములుగు: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి బి. రామ్మోహన్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని శనివారం జిల్లా సంక్షేమ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేసిందని కొనియాడారు. జయంతి కార్యక్రమంలో నేరెళ్ల శంకర్, పరికిరాల రవి, ఎన్నిలా మహేందర్, ముంజాల భిక్షపతి, కందకట్ల సారయ్య, బాసని రాంమూర్తితో పాటు రజకసంఘం నాయకులు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ భవన్ కార్యాలయ సిబ్బంది, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు మొగిళి, సరిత, మానస, రేణుక, ప్రతాప్, రత్నాకర్, కుమారస్వామి, గోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు.


