కష్టాల నుంచి ఎస్సై.. | - | Sakshi
Sakshi News home page

కష్టాల నుంచి ఎస్సై..

Sep 27 2026 1:10 AM | Updated on Sep 27 2026 1:10 AM

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని బయ్యక్కపేట కు చెందిన ఎరుకల గోవిందరాజుగౌడ్‌–కృష్ణవేణి దంపతుల కూతురు హేమాగౌడ్‌. మాది నిరుపేద కుటుంబం కావడంతో మా కూతురు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఎస్టీ హాస్టల్‌లో ఉంది. ఎంతో కష్టపడి చదివింది. తన బాధలను ఏనాడూ తమ వరకు రానివ్వలేదు. రాత్రీపగలు కష్టపడి చదివి కాళేశ్వరం జోన్‌ ఓపెన్‌ కేటగిరీలో ఎస్సై ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. కుటుంబానికి అండగా నిలుస్తూ పెద్ద దిక్కుగా మారింది. తర్వాత సైబర్‌ క్రైమ్‌ టెస్టులో ఆల్‌ ఇండియా 133వ ర్యాంకు సాధించింది. ప్రజలకు సేవ చేయాలని ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకుని లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడం తల్లిదండ్రులుగా గర్వ పడుతున్నాం. అలాగే తన సోదరీమణులు మమత, విష్ణువర్ధిని, విష్ణుకీర్తిలకు హేమాగౌడ్‌ స్ఫూర్తిగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement