రక్త పరీక్షల రిపోర్టులు సకాలంలో అందించాలి | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షల రిపోర్టులు సకాలంలో అందించాలి

Aug 21 2026 7:15 AM | Updated on Aug 21 2026 7:15 AM

ములుగు రూరల్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించి రిపోర్టులను సకాలంలో అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీ హబ్‌ను ఆయన గురువారం సందర్శించి మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాల పరీక్షలు త్వరగా నిర్వహించి రిపోర్టులను అందిస్తే ఆరోగ్య కార్యకర్తలు జ్వరపీడితుల ఆరోగ్య పరిస్థితి, వైద్యం అందించేందుకు వీలుంటుందని తెలిపారు. అనంతరం జాతీయ హెల్త్‌ మిషన్‌ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది పని తీరును పరిశీలించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ క్లినిక్‌ సందర్శించి రికార్డులను పరిశీలించారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ రోగుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, ప్రోగ్రాం విస్తరణ అధికారి సురేశ్‌బాబు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement