ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన దుబ్బాక శ్రీనివాస్‌కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు.


