విజయగణపతితో మొదలు.. | - | Sakshi
Sakshi News home page

విజయగణపతితో మొదలు..

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం రాతి కట్టడాలకు ఒక్కో అడుగు పడుతోంది. ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా పాత ఆలయాల తొలగింపు పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. డ్రాయింగ్‌, డిజైన్లలో స్వల్ప మార్పులు, చేర్పుల తర్వాత మార్కింగ్‌లు మొదలు పెట్టారు. పడమర, దక్షిణ గోపురాల మధ్య నైరుతి మూలన పూర్వం నుంచి ఉన్న విజయగణపతి ఆలయం స్థలంలోనే గురువారం మళ్లీ రాతి నిర్మాణానికి మార్కింగ్‌ ఇచ్చి ముగ్గుపోశారు. ప్రాకారానికి ముగ్గుపోసి మార్కింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. 12 ఫీట్ల మేర లోతు తవ్వకాలు జరిపి దిగువన భూమి నుంచి పైకి కాంక్రీట్‌, ఇనుముతో బేస్మెంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. క్రషర్‌ పనులు చేపట్టడానికి పక్కనే నీటి ట్యాంకు కూడా నిర్మించారు. ఇప్పటికే గ్రానైట్‌ స్టోన్‌, ఇనుము, సిమెంట్‌, ఇసుకను కాంట్రాక్టర్లు తెప్పించారు. పడమర వైపున నైరుతి నుంచి ఉత్తరం వైపున వాయువ్యం మూల వరకు 12 ఫీట్ల లోతు వరకు ప్రొక్‌లైయిన్‌తో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 360 ఫీట్ల పొడవుతో 280 ఫీట్ల వెడల్పుతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రధాన ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని గురజపల్లిలో కృష్ణశిలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం.

చురుగ్గా కాళేశ్వరాలయ

పునర్నిర్మాణ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement