
నవ చైతన్యానికి విద్య పునాది
ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్‌కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. విద్య, వైద్యం విషయంలో ఇంకా దేశానికి స్వేచ్ఛ రాలేదు. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి.
– మహంకాళి వరుణ్,
బీకాం తృతీయ సంవత్సరం
దేశంలో ప్రజలు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారు. ముఖ్యంగా బాలికల, మహిళలు హక్కులు తెలుసుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం సాధించుకోవాలి. నేటికీ మహిళలు, చిన్నారులు, యువతులపై దాడులు కొనసాగుతున్నాయి. శిక్షలు కఠినంగా ఉంటేనే ప్రజలు క్రమశిక్షణతో జీవిస్తారు. నేటి విద్యార్థులు, యువతరం ప్రభుత్వాలను ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం.
– కె.చందన, బీఎస్సీ, తృతీయ సంవత్సరం

నవ చైతన్యానికి విద్య పునాది