
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పూర్తి
విద్యుత్‌దీపాల వెలుగుల్లో కలెక్టరేట్
ములుగు రూరల్: నేడు నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానాన్ని సిద్ధం చేశారు. అదనపు కలెక్టర్ మహేందర్‌జీ వేడుకలు, సభా ప్రాంగణాన్ని గురువారం పరిశీలించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హాజరు అవుతున్నట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిద శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు 289 మందికి అవార్డులు అందించనున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్ధార్ విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు పూర్తి