రైతుల సంక్షేమమే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ధ్యేయం

Aug 14 2025 7:45 AM | Updated on Aug 14 2025 7:45 AM

రైతుల

రైతుల సంక్షేమమే ధ్యేయం

ములుగు రూరల్‌: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ములుగు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు మార్కెట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని తెలిపారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరిస్తామని వెల్లడించారు. లైసెన్స్‌ లేని పత్తి కొనుగోలు దారుల అక్రమాలను నివారించి రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు సెద సారంగం, ఎల్లారెడ్డి, సీతరాం నాయక్‌, బాలయ్య, వెంకన్న, రామస్వామి, పగడయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంబోజ చెరువుకు బుంగ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని నర్సింగాపూర్‌ గ్రామంలో కాంబోజ చెరువుకు బుంగ పడింది. మంగళవారం రాత్రి భారీవర్షం కురియడంతో చెరువులోకి భారీగా వరద వచ్చి చేరడంతో చెరువు కట్టకు బుంగ పడింది. కట్ట తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నర్సింగాపూర్‌ గ్రామ రైతులు వాట్సాప్‌ గ్రూపులో పెట్టడంతో తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి స్పందించి ఇరిగేషన్‌శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పాటు గ్రామ రైతుల సహకారంతో బుంగను పూడ్చివేతకు చర్యలు తీసుకున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో బుంగ పూడ్చివేతకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి

ములుగు రూరల్‌: ట్రాక్టర్‌ తిరగబడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన ములుగు మండలం జగ్గన్నగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన దబ్బకట్ల శోభన్‌ (35) తన ట్రాక్టర్‌ తీసుకొని వ్యవసాయ పొలంలో దమ్ము చేసేందుకు వెళ్లాడు. దమ్ము చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ తిరగపడి శోభన్‌ బురదలో చిక్కుకుపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రైతులు ట్రాక్టర్‌ కింద నుంచి శోభన్‌ను బయటకు తీసేసరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిలలు ఉన్నారు.

రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలి

ములుగు రూరల్‌: రైతులు సాగు చేస్తున్న పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వరంగల్‌ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రవణ్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్‌గౌస్‌పల్లిలో పత్తి, వరి పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వరి నాట్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఉల్లికోడు నివారణకు కార్బోన్యూరాన్‌ 3సీజీ గుళికలను ఎకరానికి 10 కేజీల చొప్పున వాడాలని తెలిపారు. నాటిన 15 రోజుల్లో వినియోగించాలని సూచించారు. పత్తి పంటలో రసం పీల్చు పురుగు నివారణకు పసుపు, నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతర్గత మందులను ప్రిపోనిల్‌ 2 మిల్లీ లేదా ఏసీపేట్‌ 1.5 గ్రాము లేదా ప్లోనిమిడ్‌ 0.3 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకార బుట్టలను అమర్చి నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు హరి, మానస, సౌందర్య, మండల వ్యవసాయ అధికారి శ్రీధర్‌, రైతులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం
1
1/3

రైతుల సంక్షేమమే ధ్యేయం

రైతుల సంక్షేమమే ధ్యేయం
2
2/3

రైతుల సంక్షేమమే ధ్యేయం

రైతుల సంక్షేమమే ధ్యేయం
3
3/3

రైతుల సంక్షేమమే ధ్యేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement