
ఉధృతంగా జంపన్నవాగు
ఏటూరునాగారం: మండలంలోని కొండాయి బ్రిడ్జివద్ద మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షానికి జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్నవాగు నూతన బ్రిడ్జి కోసం వాగులో దింపిన డయలు నీట మునిగాయి. దీంతో కొండాయి, మల్యాల, ఐలాపురం, గోవిందరాజుల కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాగుదాటే పరిస్థితి లేకపోవడంతో అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. ఈ పడవల ద్వారానే రాకపోకలను సాగించాల్సి వస్తోంది. జంపన్నవాగు ఉధృతంగా రావడంతో బ్రిడ్జి పనులు ఆగిపోయాయి. వాగు అవతల ఉన్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలకులు, జిల్లా అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి వేళలలో వాగు దాటకుండా సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
కొండాయి వద్ద మునిగిన పిల్లర్ల డయలు
పడవలు ఏర్పాటు చేసిన అధికారులు

ఉధృతంగా జంపన్నవాగు