నేడు ములుగులో తిరంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నేడు ములుగులో తిరంగా ర్యాలీ

May 20 2025 1:10 AM | Updated on May 20 2025 1:10 AM

నేడు

నేడు ములుగులో తిరంగా ర్యాలీ

ఏటూరునాగారం : దేశభక్తిని చాటేందుకు నేడు(మంగళవారం) ములుగు జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశాన్ని రక్షించిన సైనికులకు మద్దతుగా జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో గండెపల్లి సత్యం, జనార్దన్‌, గడ్డం శ్రీధర్‌, యానాల చంద్రారెడ్డి, శ్రీను, నాగేశ్వర్‌రావు, దుర్గారావు, అజిత్‌ పాల్గొన్నారు.

పెండింగ్‌ రోడ్‌ టాక్స్‌

చెల్లించాలి

ములుగు : వాహనదారులు పెండింగ్‌లో ఉన్న త్రైమాసిక రోడ్డు టాక్స్‌లను చెల్లించాలని, విధిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని ములుగు మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారులో సీట్‌ బెల్టు వేసుకోకుండా ప్రయాణిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. గడువులోగా రుసుం చెల్లించని వాహనం తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. వాహనదారులు తమ వెంట ఆర్సీ, ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రోడ్‌ టాక్స్‌, హెల్మెట్‌లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాల గడువు మరో 5 సంవత్సరాలు పెంచడానికి పునరుద్ధరణ చేసుకోవాలన్నారు.

ఐరన్‌ పోల్స్‌ ఏర్పాటు

వెంకటాపురం(ఎం) : మండలంలోని రామప్ప ఆలయ పరిధిలో గల శివాలయానికి సోమవా రం పురావస్తు శాఖ అధికారులు ఐరన్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారు. శివగుడిగా పిలవబడే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలో భాగంగా ఆలయం చుట్టూ ఐరన్‌ పోల్స్‌ (స్క్రప్‌ హోల్డింగ్‌) ఏర్పాటు చేశారు. ఆలయానికి చెందిన శిల్పాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు ఐరన్‌ పోల్స్‌ ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ జిల్లా అధికారి నవీన్‌కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వ పథకాలపై

అవగాహన

ములుగు రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాజాతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మల్లంపల్లి మండలంలోని రాంచంద్రాపురంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలపై కళాకారులు స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువవికాసం, గృహజ్యోతి, భూభారతి, రైతు భరోసా పథకాలతో పాటు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కళాకారులు తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు రహీమొద్దిన్‌, మార్త రవి, రాగుల శంకర్‌, రేలా విజయ్‌, గోల్కొండ భిక్షపతి, అమ్మపాట తిరుపతి, కిషన్‌, రాజేందర్‌, సురేష్‌, భాస్కర్‌, నరేష్‌, దీపక్‌, శ్రీలత, శోభా, రాము తదితరులు పాల్గొన్నారు.

కాటారం డీఎస్పీ బదిలీ

కాటారం: కాటారం సబ్‌ డివిజన్‌ డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ సాధారణ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కాటారం డీఎస్పీగా పని చేస్తున్న రామ్మోహన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ భూపాలపల్లి జిల్లా డీసీఆర్‌బీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న బి.నారాయణను కాటారం నూతన డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేడు ములుగులో తిరంగా ర్యాలీ
1
1/3

నేడు ములుగులో తిరంగా ర్యాలీ

నేడు ములుగులో తిరంగా ర్యాలీ
2
2/3

నేడు ములుగులో తిరంగా ర్యాలీ

నేడు ములుగులో తిరంగా ర్యాలీ
3
3/3

నేడు ములుగులో తిరంగా ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement