గోవిందరావుపేట: రైతులు తమ పంటపొలాలను కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటుంటే పస్రా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మార్పీస్, ఎంఎస్‌పీ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి అన్నారు. మండల పరిధిలోని మొద్దులగూడెం– రాంపూర్ సమీపంలోని సర్వే నంబర్ 41, కర్లపల్లిలోని సర్వే నంబర్లు 91, 175, 94, 171లో ఉన్న 400 మంది రైతులకు చెందిన పంట పొలాలను ఆదివారం పైడి ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాధను మంత్రి సీతక్క అర్ధం చేసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పస్రా ఫారెస్ట్ అధికారులు 400మంది రైతులను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. వరి పంట పొట్టదశలో ఉందని తెలిపారు. గుండ్లవాగు ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైతులు బోర్లు వేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ
జాతీయ కార్యదర్శి పైడి