Kona Venkat : 'మా నాన్న డీఎస్పీ.. ఆయన కారులోనే వెళ్లి గంజాయి స్మగ్లింగ్‌ చేశాను'

Writer Kona Venkat Reveals He Supplied Ganjayi For His Friend - Sakshi

ప్రముఖ రచయిత కోన వెంకట్‌కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. నిన్నుకోరి, జై లవకుశ సహా ఎన్నో హిట్‌ సినిమాలకు ఆయన పనిచేశారు. ఓ వైపు రైటర్‌గా పనిచేస్తూనే, మరోవైపే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేశానంటూ రివీల్‌ చేశారు.

''ఆర్థికసమస్యల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన నా ఫ్రెండ్‌ ఒకడు దాన్నుంచి బయటపడేందుకు గంజాయి పండించాడు. ఆ మొత్తాన్ని గోవాకి తరలించి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. కానీ దారిలో పోలీసులకు దొరికిపోయాడు. ఇంక అంతా అయిపోందనుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. చావుబతుకుల్లో ఉన్నప్పుడు మాకు విషయం తెలిసి ఎలాగైనా వాడి అప్పులు తీర్చాలని డిసైడ్‌ అయ్యాం. మా నాన్న అప్పుడు డీఎస్పీ కావడంతో ఆయన కారులోనే గంజాయి అ‍మ్మేందుకు గోవా వెళ్లాం.

మహబూబ్నగర్, కర్ణాటక, గోవా ఇలా 3 చెక్ పోస్టులు పగడ్బందీగా దాటించి గంజాయి అమ్మి డబ్బులు తీసుకొచ్చాం. దాంతో నా స్నేహితుడి అప్పులన్నీ తీర్చేశాం. కానీ ఒకవేళ దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలాసార్లు ఆలోచిస్తుంటాను. మా రియల్‌ లైఫ్‌లో జరిగిన ఈ స్టోరీనే సినిమాగా తీయాలని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చారు.  అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే కానీ ఇలా గంజాయి స్మగ్లింగ్‌ చేయడం ఏంటని మండిపడుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top