Bollywood: ఖాన్స్‌కి ఏమైంది... మరీ ఇంత దారుణమా?

Why Shahrukh, Salman, Aamir Khan Movies are Flopping at the Box Office - Sakshi

ఒకప్పుడు బాలీవుడ్‌ అంటే ఖాన్స్‌.. ఖాన్స్‌ అంటే బాలీవుడ్‌. కానీ ఇప్పుడు ఖాన్స్‌ పని అయిపోయింది. వారి నుంచే సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు.  నాలుగేళ్ల క్రితం షారుఖ్ ఖాన్‌ ‘జీరో’లో నటించి బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా జీరోగా మారాడు. ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చడ్దా’లో నటించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ను చూశాడు. ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ  రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. తీరా చూస్తే ‘లాల్‌సింగ్‌ చడ్డా’ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. 

(చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి)

2000 లో ఆమిర్ నటించిన ‘మేళ’అతని కెరీర్ లోబిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ‘ఇప్పుడు ఆ రికార్డ్ ను లాల్ సింగ్ చడ్డా’ బద్దలు కొట్టాడు అంటోంది బాలీవుడ్. వారం రోజులు థియేటర్ లో ఉన్నా,60 కోట్ల మార్క్ దాటలేకపోయింది. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కలిసొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ మాత్రం వసూళ్లు కూడా వచ్చి ఉండాల్సింది కాదు అంటోంది బాలీవుడ్.

ఒకప్పుడు బాలీవుడ్ బ్యాక్ బోన్ గా నిలిచారు ఖాన్స్. కాని ఇప్పుడు ఆ ప్రాభవం లేదు. షారుఖ్ కంప్లీట్ గా బాక్సాఫీస్ రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆమిర్ ఆరేళ్లలో రెండు డిజాస్టర్లు కొట్టి ప్రేక్షకుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఇక మిగిలింది సల్మాన్ ఖాన్‌ మాత్రమే. ప్రస్తుతం సల్మాన్ మాత్రమే ఫామ్ కొనసాగిస్తున్నాడు. నెక్ట్స్ ఇయర్ ఈద్ కు టైగర్ 3ని రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా పై  బాలీవుడ్ చాలా నమ్మకాలే పెట్టుకుంది. అసలు ఈ ఖాన్స్‌కి ఏమైంది.. ఎందుకు ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారని ఫాన్స్‌ మదన పడుతున్నారు. ఇప్పటికైనా మంచి సబ్జెక్ట్‌ని ఎంచుకొని తిరిగి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top