
సెలబ్రిటీలకు సమాజంలో ఉండే క్రేజే వేరు. సినీతారలు వస్తున్నారంటే వారిని చూసేందుకు జనం ఎగబడతారు. హీరో తాకినా, సెల్ఫీ ఇచ్చినా, చూసి నవ్వినా.. జన్మ ధన్యమైపోయిందన్నట్లుగా ఫీలవుతారు. కానీ, ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు అసలుకే ఎసరు పెడుతుంది. పుష్ప 2 ప్రీమియర్స్‌లో ఇదే జరిగింది. డిసెంబర్ 4న సినిమా చూడటానికి అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్‌కు వస్తే.. ఆయన్ను చూసేందుకు జనం విపరీతంగా వచ్చారు.
తొక్కిసలాటపై తొలిసారి స్పందన
ఫలితంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ ప్రాణం పోగా ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ తొక్కిసలాటకు హీరో కూడా కారణమంటూ అల్లు అర్జున్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక రోజు తర్వాత బన్నీ జైలు నుంచి రిలీజై బయటకు వచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత ఈ ఘటన గురించి హీరో మంచు విష్ణు (Vishnu Manchu) స్పందించాడు.
అదే మాకు కిక్కిస్తుంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. ఇప్పటికీ కేసు కోర్టులో నడుస్తున్నందున దీనిపై నేను పెద్దగా మాట్లాడలేను. కానీ, మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఈ ఘటనకు బన్నీ బాధ్యుడు కాడని మాత్రం చెప్పగలను. అతడు తనలా ఉండటమే తప్పయిపోయింది. ఆర్టిస్టులమైన మాకు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపిస్తుంది. జనాల రెస్పాన్స్ తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. అది మాకు కిక్ ఇస్తుంది. వింబుల్డన్ గెలిచినంత తృప్తిగా ఉంది.
అందుకేగా కష్టపడేది
మమ్మల్ని స్క్రీన్‌పై చూసి జనాలు అరుస్తుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది? దానికోసమేగా మేము కష్టపడేది. ఆకలిని చంపుకుని డైట్ చేసేది, చెమటలు చిందించేది, రక్తాన్ని ధారపోసేది. ఏదేమైనా ఆరోజు ఓ అభిమాని మరణించడం దురదృష్టకరమే! కానీ, దానికి బన్నీని బాధ్యుడిని చేయడం మాత్రం తప్పు అని విష్ణు మంచు చెప్పుకొచ్చాడు.
చదవండి: రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్