ప్రతి ఒక్కరికీ రిలేట్‌ అయ్యే స్టోరీ ‘తంగలాన్‌’: విక్రమ్‌ | Vikram Talk About Thangalaan Movie | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ రిలేట్‌ అయ్యే స్టోరీ ‘తంగలాన్‌’: విక్రమ్‌

Aug 6 2024 1:19 PM | Updated on Aug 6 2024 1:19 PM

Vikram Talk About Thangalaan Movie

‘‘తంగలాన్‌’ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలోని నా లుక్‌ని ఫస్ట్‌ టైమ్‌ రిలీజ్‌ చేసినప్పుడు ‘కేజీఎఫ్‌’ మూవీలా ఉంటుందా? అన్నారు. అలాగే తెగ నాయకుడి గెటప్‌ రిలీజ్‌ చేశాక రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందన్నారు. కానీ ‘తంగలాన్‌’ లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి’’ అని హీరో విక్రమ్‌ అన్నారు. 

పారంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా, పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తంగలాన్‌’. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘రంజిత్‌ నా ఫేవరెట్‌ డైరెక్టర్‌. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్‌ అయ్యే స్టోరీ ‘తంగలాన్‌’. బంగారం వేట అనేది హైలైట్‌ అవుతున్నా.. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది’’ అన్నారు. పాన్‌ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు చేరువకావడం సంతోషం’’ అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement