డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’

Vijay Shankar New Film Started Titled As Focus - Sakshi

విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్‌ శంకర్‌ మరో విలక్షణమైన కథతో మ‌న ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి  ‘ఫోకస్‌’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్‌ పేర్కొంది. ప్ర‌ముఖ న‌టి సుహాసిని మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా,  అషూరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో కనిపిస్తారు.

‘మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్‌ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top