నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్‌ సేతుపతి | Vijay Sethupathi Reveals His First Love Story - Sakshi
Sakshi News home page

నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్‌ సేతుపతి

Published Fri, Sep 1 2023 8:00 AM | Last Updated on Fri, Sep 1 2023 8:57 AM

Vijay Sethupathi Reveal His First Love Story - Sakshi

బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ పఠాన్‌ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్‌. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్‌ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్‌ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది.

(ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్‌ రివ్యూ)

ఈ సందర్భంగా జవాన్‌ ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్‌ ఖాన్‌ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు.

షారుక్‌ ఖాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్‌ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్‌ సైడ్‌ లవ్‌ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్‌ ఖాన్‌ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్‌ ఖాన్‌పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు.

(ఇదీ చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్‌ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?)

షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ నటుడు విజయ్‌ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్‌ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్‌ ఖాన్‌ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్‌ చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పాల్గొనడానికి వచ్చిన షారుక్‌ ఖాన్‌కు నటుడు కమలహాసన్‌ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement