దళపతి విజయ్‌ షాకింగ్‌ రెమ్యునరేషన్‌!

Vijay Remuneration For Vamshi Paidipally Movie - Sakshi

తమిళ హీరో విజయ్‌ సినిమాలు తెలుగులోనూ బాగానే ఆడతాయి. ఫలితంగా ఆయనకు ఇక్కడ కూడా బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా విజయ్‌ నటించిన పలు సినిమాలు తమిళం, తెలుగులో ఒకేసారి రిలీజ్‌ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సర్కార్‌, అదిరింది, విజిల్‌, మాస్టర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. దీంతో విజయ్‌ తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు ఊపందుకున్నాయి.

మహర్షి డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్‌ రెమ్యునరేషన్‌ గురించి ఓ వార్త ఫిల్మీదునియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలుగులో తొలి సినిమాకు ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట, నిజానికి ఇప్పటివరకు విజయ్‌ తన తమిళ సినిమాలకు దాదాపు రూ.80 కోట్లు తీసుకుంటున్నారట. కానీ తెలుగులో మాత్రం దాన్ని మించిపోయేలా మరో పది కోట్లు అదనంగా తీసుకుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి విజయ్‌ డేట్స్‌ కోసం దిల్‌ రాజే ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశాడని అంటున్నారు.

చదవండి: విజయ్‌ దేవరకొండను రంగంలోకి దించిన తెలంగాణ సర్కార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top