జోడీ కుదురుతుందా?

Vijay Next Movie Will Have Pooja Hegde As The Female Lead - Sakshi

పూజా హెగ్డే 

అన్నీ కుదిరితే ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తమిళ తెరపై పూజా హెగ్డే కనిపించే అవకాశం ఉంది. 2012లో చేసిన తమిళ చిత్రం ‘ముగముడి’ ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’తో తెలుగుకి వచ్చారు. ‘అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో ఇక్కడ బిజీ అయ్యారు పూజ. ఇప్పుడు హిందీ చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు.

ఈలోపు కోలీవుడ్‌ నుంచి ఆమెకు కాల్‌ వచ్చింది. తమిళ మాస్‌ హీరో విజయ్‌ 65వ సినిమాకి పూజా హెగ్డేని కథానాయికగా అడిగారని సమాచారం. చిత్రదర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఇటీవల పూజా హెగ్డేని కలసి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పారట. స్టోరీ లైన్‌ కూడా చెప్పారని తెలిసింది. ఇప్పటికే తెలుగు, హిందీ చిత్రాలకు ఇచ్చిన డేట్స్‌ ఒకసారి చూసుకుని ఈ తమిళ చిత్రానికి పూజ డేట్స్‌  కేటాయించాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top