Vijay Devarakonda: ఏంటో.. అందరికి నా బర్త్‌డే సెంటిమెంట్‌ అయిపోయింది

Vijay Deverakonda Tweet On His Birthday About Telugu Movie Update - Sakshi

Vijay Deverakonda Tweet On His Birthday: ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల లైగర్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన విజయ్‌, అప్పుడే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్‌ చేయగా.. మరోసారి పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో జనగనమణ సినిమాలను స్టార్ట్‌ చేసేశాడు. ఇదిలా ఉంటే నేడు (మే 9న) విజయ్ బర్త్ డే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా విజయ్‌కి స్పెషల్ విషెష్ చెప్తున్నారు. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ సమంత అర్ధరాత్రే విజయ్‌తో కేక్ కట్ చేయించి రౌడీ బర్త్‌డేను సెలబ్రెట్‌ చేసింది. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా లైగర్‌ మూవీ టీం ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేయనుంది.

చదవండి: ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ మూవీకి డేట్‌ ఫిక్స్‌, ఆ రోజే లాంచ్‌!

ఈ నేపథ్యంలో సాయంత్రం లైగర్‌ మూవీ నుంచి ఓ అప్‌డేట్‌ ఇవ్వనుంది మూవీ టీం. ఈ క్రమంలో తన బర్త్‌డే సందర్బంగా విజయ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజు నా బర్త్‌డే. ఏంటో నా బర్త్‌డే అందరికి సెంటిమెంట్‌ అయిపోయింది. ఇదే రోజు ఎఫ్‌ 3, మేజర్‌ మూవీల ట్రైలర్‌, అంటే సుందరికి నుంచి సాంగ్‌ ఈ రోజే రిలీజ్‌ కానున్నాయి. దీనితో పాటు బాలీవుడ్‌ బాలీవుడ్‌ చిత్రం పృథ్విరాజ్‌ ట్రైలర్‌ కూడా ఈ రోజే విడుదల’ అంటూ ట్వీట్‌ చేశాడు విజయ్‌. కాగా ఈ రోజు మే 9న సాయంత్రం నాలుగు గంటలకు లైగర్‌కు సంబంధించిన ఒక స్పెషల్ థీమ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి: మదర్స్‌ డే: తొలిసారి కూతురు ఫొటో షేర్‌ చేసిన ప్రియాంక చోప్రా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top