థియేటర్లోనే మాస్టారూ...

Vijay and Vijay Sethupathi Master to release in theatres first - Sakshi

విజయ్‌ హీరోగా, విజయ్‌ సేతుపతి విలన్‌గా కలసి చేసిన తొలి చిత్రం ‘మాస్టర్‌’. లోకేశ్‌ కనకరాజ్‌  దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదట ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

థియేటర్ల రీ ఓపెన్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే విడుదల చేయబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్తను ఖండిస్తూ.. ‘మాస్టర్‌’ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ ప్రేక్షకులను ఉద్దేశించి ‘మాస్టర్‌’ సినిమాని టీవీలో చూస్తారా? సినిమా థియేటర్‌లోనా? అని ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆ ట్వీట్‌కు స్పందించిన ప్రేక్షకులు ‘థియేటర్‌లోనే’ అన్నారు. ఈ సినిమా నేరుగా థియేటర్లోనే విడుదల కావడం విజయ్‌ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top