breaking news
Vijaysthupathi
-
థియేటర్లోనే మాస్టారూ...
విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా కలసి చేసిన తొలి చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదట ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. థియేటర్ల రీ ఓపెన్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్తను ఖండిస్తూ.. ‘మాస్టర్’ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ ప్రేక్షకులను ఉద్దేశించి ‘మాస్టర్’ సినిమాని టీవీలో చూస్తారా? సినిమా థియేటర్లోనా? అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్‌కు స్పందించిన ప్రేక్షకులు ‘థియేటర్లోనే’ అన్నారు. ఈ సినిమా నేరుగా థియేటర్లోనే విడుదల కావడం విజయ్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం. -
మామనిధన్‌గా విజయ్‌సేతుపతి
తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయన మాధవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం విక్రంవేదా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా త్రిషతో కలిసి 96 చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. దర్శకుడు శీనూరామస్వామి, విజయ్సేతుపతిలది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇంకా చెప్పాలంటే తెన్మేర్కు పరువకాట్రు చిత్రం తో విజయ్‌సేతుపతిని నటుడిగా నిలబెట్టింది దర్శకుడు శీనూరామస్వామి నే. ఆ తరువాత ఇడమ్ పొరుల్ ఏవల్ చిత్రం వీరి కాంబినేషన్లో తెరకెక్కిం ది. ఈ చిత్రం నిర్మాణం పూర్తి అయినా ఇంకా తెరపైకి రాలేదు. ఆ తరువాత ధర్మదురై చిత్రం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విజయ్‌సేతుపతిని మామనిధన్‌గా చూపించడానికి దర్శకుడు శీనూరామస్వామి రెడీ అవుతున్నారు. దీని గురించి కొన్ని నెలల క్రితమే వెల్లడించినా, ఆ తరువాత చిత్రానికి సంబంధించిన సమాచారం ఏమీ రాలేదు. తాజాగా దర్శకుడు శీనూరామస్వామి మామనిధన్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది దక్షణ తమిళ ప్రాంతంలో నివశించిన ఒక ప్రముఖ వ్యక్తి ఇతివృత్తంగా తెరకెక్కించనున్నట్లు చెప్పారు. ఇది విజయ్‌సేతుపతిని మరో కోణంలో ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను అక్టోబరులో ప్రారంభిం చనున్నట్లు తెలిపారు.ఇందులో కథానాయకి, ఇతర తారా గణం, సాంకేతికవర్గం ఎంపిక ప్ర స్తుతం జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.