నా సినిమాతో కోట్లు నష్టపోయా.. సర్కస్‌లో చేరా: హీరో | Vidyut Jammwal: I Lost Many Crores After Crackk Box Office Failure | Sakshi
Sakshi News home page

Vidyut Jammwal: నా సినిమా ఫ్లాప్‌.. కోట్ల డబ్బు నష్టపోయా.. సర్కస్‌లో జాయిన్‌ అయ్యా..

Jun 28 2024 5:01 PM | Updated on Jun 28 2024 6:03 PM

Vidyut Jammwal: I Lost Many Crores After Crackk Box Office Failure

సినిమాలు నిర్మించడమనేది అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా చేతులు కాలాల్సిందే! బాలీవుడ్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ ఆమధ్య క్రాక్‌ అనే సినిమా తీశాడు. తను హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడింది. ఈ చిత్రం వల్ల ఎంతో నష్టపోయానంటున్నాడు విద్యుత్‌ జమ్వాల్‌.

సర్కస్‌లో చేరా..
తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రాక్‌ ఫ్లాప్‌ అవడం వల్ల చాలా డబ్బు నష్టపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెంచ్‌ సర్కస్‌లో జాయిన్‌ అయ్యాను. 14 రోజులు అక్కడే ఉన్నాను. శరీరాన్ని నచ్చిన యాంగిల్స్‌లోకి వంచుతూ విన్యాసాలు చేసేవారిని కలుసుకున్నాను. ఇలా ఎలా చేయగలుగుతున్నారా? అని ఆశ్చర్యపోయేవాడిని. ఆ సర్కస్‌ గదిలో అందరికంటే నేనే చిన్నగా ఉండేవాడిని. 

మూడు నెలల్లోనే..
కొద్దిరోజులు వారితో కలిసుండి ముంబై వచ్చేసరికి అంతా మామూలైపోయేది. మూడు నెలల్లోనే నా అప్పులు తీరిపోయాయి. ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా దాన్నుంచి బయటపడే ప్రయత్నాలు వెతుక్కున్నాను అని విద్యుత్‌ జమ్వాల్‌ చెప్పుకొచ్చాడు. కాగా క్రాక్‌ సినిమాలో అర్జున్‌ రాంపాల్‌, నోరా ఫతేహి, అమీ జాక్సన్‌ ముఖ్య పాత్రలు పోషించగా ఆదిత్య దత్‌ దర్శకత్వం వహించాడు.

చదవండి: నేరుగా ఓటీటీకి టాలీవుడ్ సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement