ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే? | Vidyut Jammwal Himalayas Pics Shares Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

బట్టలు లేకుండా కనిపించిన శక్తి నటుడు.. స్పందించిన ఆర్జీవీ

Dec 10 2023 4:37 PM | Updated on Dec 10 2023 7:28 PM

Vidyut Jammwal Himalayas Pics Shares Tweet Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం శక్తి ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విద్యుత్‌ జమ్వాల్. శక్తి మూవీతో అరంగేట్రం చేసిన జమ్వాల్.. ఆ తర్వాత తెలుగులో ఊసరవెల్లి చిత్రంలోనూ నటించారు.  అయితే ఆ రెండు పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత బిల్లా-2 తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. ఫోర్స్ ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన జమ్వాల్.. కమాండో చిత్రాల సిరీస్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు.  హిందీలో అంజాన్,  బాద్షాహో, కమాండో 2, జంగ్లీ, యారా, కమాండో -3 చిత్రాల్లో కనిపించారు.  ప్రస్తుతం షేర్ సింగ్ రానా, క్రాక్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా నిర్మాతగా మారి స్వయంగా సినిమాలు నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా విద్యుత్ జమ్వాల్ చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. హిమాలయ పర్వతాల్లో నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రతి సంవత్సరం  7 నుంచి 10 రోజుల సమయం ఇలా కేటాయించాలని రాసుకొచ్చారు. దాదాపు 14 ఏళ్ల క్రితం మొదలైన హిమాలయాల జర్నీ  మళ్లీ ప్రారంభించినట్లు తెలిపారు. ఇది తన జీవితంలో ఓ అంతర్భాగమని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఇది చూసి సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు.  మీలోని జంతువును బయటకు తీసుకురావడం ఇది చాలా సమయానుకూలమని నేను భావిస్తున్నా ...మీరు నిజంగా గ్రీకు దేవుడిలా కనిపిస్తున్నారు .. మీకు కోటి వందనాలు అంటూ రిప్లై ఇచ్చారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement