పర్వీన్‌ బాబీ ‌ జీవిత చరిత్రపై విద్యాబాలన్‌ చూపు

Vidya Balan Interested In Parveen Babis Biography - Sakshi

ముంబై: గణిత మేధావి శకుంతల దేవి బయోపిక్‌లో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటన అందరిని అలరించింది. ఈ నేపథ్యంలో బయోపిక్‌లపై విద్యాబాలన్‌ ఆసక్తి చూపుతోంది. కాగా మాజీ బాలీవుడ్‌ నటి పరవీన్‌ బాబీ జీవీత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని జర్నలిస్ట్‌ కరీష్మా బాయ్‌ ఇటీవల విడుదల చేశారు. కాగా పరవీన్‌ బాబీ 2005సంవత్సరంలో మరణించారు. పరవీన్‌ జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, మలుపులు, ఆరోగ్య సమస్యలు తదితర విభిన్న సంఘటనలతో బయోపిక్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి.

పర్వీన్‌ బాబీ గురించి జర్నలిస్ట్‌ కరీష్మా చెబుతూ.. పర్వీన్‌ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఆమె సినిమా కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు, ఓ ఆధ్యాత్మిక గురువు ఆమెను సినిమాలో నటించవద్దని చెప్పడం లాంటి ట్వీస్ట్‌లు ఆమె జీవితంలో అనేకం ఉన్నాయి. కాగా, నటి పరవీన్‌ను  గొప్ప నటి అంటూ విద్యాబాలన్‌ కొనియాడారు. అయితే, పర్వీన్‌ బాబీ జీవిత చరిత్రను బమోపిక్‌గా రూపొందించడానికి విద్యాబాలన్‌ ప్రయత్నిస్తున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top