Vicky Kaushal Interesting Comments On His Wife Katrina Kaif In Recent Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Vicky Kaushal: కత్రినా వచ్చాక నా లైఫ్‌ మారిపోయింది.. నేను పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌ కాదు

Feb 2 2023 3:52 PM | Updated on Feb 2 2023 7:18 PM

Vicky Kaushal Interesting Comments on Wife Katrina Kaif In Recent Interview - Sakshi

బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ జంట ఒకటి. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విక్కీ-కత్రినా తరచూ తమ క్యూట్‌ క్యూట్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఓ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ యాడ్‌లో కలిసి నటించారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విక్కీ కౌశల్‌ మాట్లాడుతూ భార్య కత్రినా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్‌.. వీల్‌ చైర్‌లోనే..

కాగా కొంతకాలం పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు 2021 డిసెంబర్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాను పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌ కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు విక్కీ కౌశల్‌ మాట్లాడుతూ.. ‘నేను నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేనెప్పుడు పర్‌ఫెక్ట్‌ అని అనుకోను. ఓ భర్తగా, కొడుకుగా, నటుడిగా ఎందులోనూ నేను కరెక్ట్‌ కాదనేది నా అభిప్రాయం. అందుకే నన్ను నేను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. పూరిపూర్ణంగా ఉండడమే లక్ష్యంగా పని చేస్తుంటాను’ అన్నాడు. 

చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్‌ హీరో

అలాగే ఆదర్శవంతమైన భర్తనని కూడా తాను అనుకోనవడం లేదన్నాడు. కానీ, నిన్నటి కంటే రేపు ఉత్తమంగా ఉండేందుకు ట్రై చేస్తానన్నాడు. తనని తాను సరిచేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పాడు. అనంతరం భార్య కత్రినా గురించి మాట్లాడుతూ.. ‘కత్రినా నా లైఫ్‌లోకి వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. అంతా ఒక్కసారిగా మారిపోయింది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఒక సక్సెస్‌ ఫుల్‌ మ్యాన్‌గా ఎదగడానికి తను నాకు ఎంతో సహకరిస్తోంది’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement