ఇదే టీమ్‌తో మరో సినిమా ఉంటుంది | Veyi Subhamulu Kalugu Neeku Teaser Launch | Sakshi
Sakshi News home page

ఇదే టీమ్‌తో మరో సినిమా ఉంటుంది

Sep 5 2020 2:53 AM | Updated on Sep 5 2020 2:53 AM

 Veyi Subhamulu Kalugu Neeku Teaser Launch - Sakshi

నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. రామ్స్‌ రాథోడ్‌ దర్శకత్వం వహించారు. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ కథానాయికలుగా నటించారు. జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్‌ నిర్మించారు. విజయ్‌ రాజా పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను నటుడు సునీల్‌ విడుదల చేసి, యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయింది. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ‘వేయి శుభములు కలుగు నీకు’ టీమ్‌తోనే మరో సినిమా త్వరలోనే స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు విజయ్‌ రాజా. ‘‘మా సినిమాకి మంచి టైటిల్‌ దొరికింది. నాకు మంచి నిర్మాత కుదిరారు’’ అన్నారు రామ్స్‌ రాథోడ్‌. ‘‘మా సినిమా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు తూము నరసింహ పటేల్‌. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కె బుజ్జి, సంగీతం: గ్యాని సింగ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విక్రమ్‌ రమణ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement