దరువెయ్‌ బాగా వచ్చింది – సాయిరామ్‌ శంకర్‌ | Vey Dharuvey Teaser out | Sakshi
Sakshi News home page

దరువెయ్‌ బాగా వచ్చింది – సాయిరామ్‌ శంకర్‌

Feb 17 2023 2:59 AM | Updated on Feb 17 2023 2:59 AM

Vey Dharuvey Teaser out - Sakshi

‘‘వెయ్‌ దరువెయ్‌’ టీజర్‌ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా హిట్‌ కావాలి. సాయి అన్నకి, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు మరిన్ని అవకాశాలు రావాలి’’ అన్నారు హీరో సాయిధరమ్‌ తేజ్‌. సాయిరామ్‌ శంకర్, యాశా శివకుమార్‌ జంటగా నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’. దేవరాజు పొత్తూరు నిర్మించిన ఈ సినిమా మార్చిలో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం టీజర్‌ని సాయిధరమ్‌ రిలీజ్‌ చేశారు.

సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన రెండు పాటలకు విశేష స్పందన లభించింది. సినిమా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సాయిరామ్, దేవరాజుగార్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను’’ అన్నారు నవీన్‌ రెడ్డి. ‘‘సాయిరామ్‌గారి కెరీర్‌లో మరొక మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు దేవరాజ్‌. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్, కెమెరా: ముత్యాల సతీష్ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: జనగాని కార్తీక్, శ్రీపాల్‌ చొల్లేటి.

Advertisement
 
Advertisement
Advertisement