బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న మెగా హీరో! | Varun Tej Bollywood Debut Locked With Big Production House: Check Details | Sakshi
Sakshi News home page

Varun Tej : బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న మెగా హీరో

Published Tue, Jul 6 2021 12:07 PM | Last Updated on Tue, Jul 6 2021 12:12 PM

Varun Tej Bollywood Debut Locked With Big Production House: Check Details - Sakshi

సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లకు బాలీవుడ్‌ అంటె కొంచెం క్రేజ్‌ ఎక్కువ. అందుకే తమ ఇండస్ట్రీలో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్తుంటారు. అందుకు టాలీవుడ్‌ పరిశ్రమ కూడా అతీతం కాదు. మన స్టార్‌ హీరోల్లో చాలామంది బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. మరికొంతమంది హిందీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా చేరాడు. 

మెగా హీరోలంతా మాస్‌ సినిమాలు చేస్తుంటే.. వరుణ్‌ మాత్రం అందుకు కాస్త భిన్నంగా వెళ్తున్నాడు. ఒక జానర్‌కు పరిమితం కాకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు వరుణ్. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్‌ బాక్సింగ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బాలీవుడ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నాడట వరుణ్‌.

సోనీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థలో వరుణ్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాను తెలుగు హిందీలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో.. బాలీవుడ్‌లో ఎంతవరకు సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement