దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్‌, వెంకీ..!

Varun Tej And Venkatesh Demands High Remuneration To F3 - Sakshi

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్‌ మళ్లీ షూరు అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కకడ మూతబడ్డ కెమెరాలు క్లిక్క్‌మనిపించేందుకు సిద్ధమయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌  కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త కథలు, కొత్త సినిమాల కబుర్లలతో ఇండస్ట్రీలో మునుపటి వాతావరణం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో కూర్చుని కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు వాటిని పట్టాలెక్కించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక హీరోలు సైతం కొత్త కథలపై దృష్టిసారించారు. సుదీర్ఘ విరామం అనంతరం రానున్న సినిమాలు కావడంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

ఇక అసలు విషయాని కొస్తే టాలీవుడ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమాలపై మరింత దూకుడు పెంచాడు. కెరీర్‌లో ప్రారంభంలో వడివడిగా అడుగులేసిన యంగ్‌ హీరో.. ఫిదా, గద్దలకొండ గణేష్‌,  ఎఫ్‌2 విజయాలతో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాడు. వరుస సినిమాల విజయంతో రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశాడు. స్టార్‌ హీరోలతో పోల్చుకుంటే తానేమీ తక్కవ కాదంటూ నిర్మాతల ముందు భారీ మొత్తాన్నే డిమాండ్‌ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్‌2 చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 35 కోట్లతో దిల్‌ రాజు నిర్మించిన ఈ కామెడీ మూవీ దాదాపు 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఎఫ్‌2 ఇచ్చిన విజయంతో దిల్‌కుష్‌గా ఉన్న దర్శక, నిర్మాతలు ఎఫ్‌3 మూవీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ మేరకు దర్శకుడు అనిల్‌ రావిపూడి కథను కూడా సిద్ధం చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఎఫ్‌3కి తనకు పారితోషికతం మరింత పెంచాలని హీరో వరుణ్‌ తేజ్‌ నిర్మాతకు ముడిపెట్టాడు. దాదాపు 12 కోట్లు వరకు ఇ‍వ్వాలని పట్టుపట్టినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరోవైపు వెంకటేష్‌ సైతం తనకు 13 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు వరుస హిట్స్‌తో స్టార్‌ దర్శకుల సరసన చేరిన అనిల్‌ సైతం భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. అయితే భారీ బడ్జెట్‌తో ఎఫ్‌3ని తెరక్కించాలనుకున్న దిల్‌రాజ్‌కు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఊహించని పారితోషికం డిమాండ్‌ చేయడం తలనొప్పిగా మారింది. దర్శకుడు ఇప్పటికే కథ సిద్ధం చేయడం. చిత్రీకరణకు కూడా ముహూర్తం ఖరారు కావడంతో ఇక చేసేదేమీ లేక వారి డిమాండ్స్‌కు నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top