నా కుటుంబమే నా బలం

Varun Dhawan wife Natasha Dalal pregnant with first child - Sakshi

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ఓ శుభవార్తను షేర్‌ చేశారు. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మేం తల్లిదండ్రులయ్యాం. మీ ఆశీర్వాదాలు కావాలి. మై ఫ్యామిలీ మై స్ట్రెన్త్‌ (నా కుటుంబమే నా బలం)’’ అంటూ తన భార్య నటషాదలాల్‌ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోను షేర్‌ చేశారు వరుణ్‌ధావన్‌.

ఫ్యాషన్‌ డిజైనర్, మోడల్‌ నటషా దలాల్‌ను 2021 జనవరిలో వరుణ్‌ వివాహం చేసుకున్నారు. హిందీలో ప్రస్తుతం ‘బేబీ జాన్‌’ సినిమా చేస్తున్నారు వరుణ్‌ ధావన్‌. అలాగే ఆయన నటించిన ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌సిరీస్‌ ఈ ఏడాది వేసవిలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇందులో సమంత ఓ లీడ్‌ రోల్‌ చేశారు.
 

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top