
‘అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు ఉంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి’ అన్న డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘శివంగి’ సినిమా ట్రైలర్. ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు. పి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.
శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘నువ్వు ఒకడ్ని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకున్నావ్.., ప్రేమించినవాడి కోసం లైఫ్ అంతా వెయిట్ చేయడానికి నేను రెడీ, ఇసుమంటి అత్తల–కోడళ్లప్రాబ్లమ్ ప్రతి ఇంట్లో ఆల్ ఓవర్ వరల్డ్‌కి ప్రాబ్లమ్.., ఇది నాకు, మా అత్తమ్మకి, మేనేజర్ కిరణ్‌గాడికి జరుగుతున్న వార్... దీంట్లో మేం గెలుస్తాం, సత్యభామ రా... సవాల్ చేయకు... చంపేస్తా’ అన్న డైలాగ్స్ ‘శివంగి’ సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment