Varalakshmi Sarathkumar: సమంత నాకెప్పటి నుంచో తెలుసు, షూటింగ్‌ గ్యాప్‌లో మేము..

Varalakshmi Sarathkumar About Yashoda Movie - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్షి శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. హరి, హరీష్ దర్శకత్వం వహించగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న సినిమా రిలీజవుతున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం... 

► 'యశోద' కథ విన్నప్పుడు ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోతూ అడిగాను. ఇందులో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్... మా కథలు ఆసక్తిగా ఉంటాయి.  

► సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. 

► నాది డాక్టర్‌ రోల్‌ కాదు అండి. ట్రైలర్‌లో చూపించిన సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్. ఆమె చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. నిజ జీవితంలో నా డ్రసింగ్ స్టైల్, ఇతర అంశాలకు పూర్తి విరుద్ధంగా ఆ పాత్ర ఉంటుంది. తనను తాను బాగా ప్రేమించే పాత్ర. 

► దర్శకులు ఇద్దరూ చాలా కామ్. నేను పని చేసిన దర్శకుల్లో అంత కామ్ గా ఎవరినీ చూడలేదు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. 

► సినిమాటోగ్రాఫర్ సుకుమార్ గారు అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ గారు మంచి సంగీతం అందిస్తున్నారు. మీరు పెట్టే టికెట్ రేటుకు వేల్యూ ఉంటుంది. సినిమాలో అంత మంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది. 

► సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారనిపిస్తుంది.

► నాకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసు. మాకు చెన్నైలో పరిచయం అయ్యింది. సినిమాలో తనకు సీరియస్ సీన్స్ ఉన్నాయి. నేను ఏమో షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్ని. తను నవ్వేది. 'షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావ్?' అనేది. తనతో నటించడం సరదాగా ఉంటుంది. తను స్ట్రాంగ్ విమెన్. పాత్రలో జీవించింది. పవర్ ఫుల్ రోల్ బాగా చేసింది.

► 'క్రాక్'లో జయమ్మ తర్వాత నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. రచయితలు నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారు. ఇప్పుడు నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. బయటకు వెళ్ళడానికి ఖాళీ లేదు. తమిళ సినిమాలు చేయడానికి డేట్స్ లేవు. నాకు స్టీరియో టైప్ రోల్స్ రావడం లేదు. అది సంతోషంగా ఉంది. 

► తెలుగులో 'శబరి' చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. 'వీర సింహా రెడ్డి'లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.

చదవండి: సమంత ఆరోగ్యంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్‌ ఖేర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top