ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదు: యంగ్ డైరెక్టర్ | Sakshi
Sakshi News home page

త్వరలో సినిమా రిలీజ్.. ముందే ఆ విషయం చెప్పిన దర్శకుడు

Published Fri, Jan 19 2024 2:46 PM

Vadakkupatti Ramasamy Movie Director Karthik Yogi Comments - Sakshi

ప్రముఖ కమెడియన్ కమ్ హీరో సంతానం లేటెస్ట్ మూవీ 'ఉడక్కపట్టి రామస్వామి'. దర్శకుడు కార్తీక్‌ యోగి తీసిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘాఆకాష్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక రిలీజ్ దగ్గర పడిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం చైన్నెలో ప్రెస్ మీట ఏర్పాటు చేసి సినిమా గురించి పలు విషయాల్ని చెప్పుకొచ్చారు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)

'ఇది 1974లో జరిగే కామెడీ మూవీ. సంతానం మట్టికుండల వ్యాపారిగా.. మేఘా ఆకాష్‌ మిలటరీ డాక్టర్‌గా నటించారు చెప్పారు. మద్రాస్‌ ఐ అనే అంటువ్యాధి కొత్తగా వ్యాపిస్తున్న సమయాన్ని హీరో ఎలా తనకు అనుకూలంగా వాడుకుంటాడు అనే విషయాన్ని కామెడీతో మిక్స్ చేసి సినిమా తీశాం. ఇది ఎవరి మనోభావాలకు దెబ్బతీయదు' అని దర్శకుడు కార్తీక్ యోగి చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: 'హనుమాన్' తెచ్చిన జోష్.. రాముడి పాత్రలో మెగాహీరో రామ్‌ చరణ్?)

Advertisement
 
Advertisement