సోషల్ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్.. స్పందించిన ఉపాసన! | Upasana Konidela reaction on her negative comments over her comments | Sakshi
Sakshi News home page

Upasana Konidela: సోషల్ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్.. స్పందించిన ఉపాసన!

Nov 19 2025 9:41 PM | Updated on Nov 19 2025 10:19 PM

Upasana Konidela reaction on her negative comments over her comments

ఇటీవల మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఉపాసన యువతకు కెరీర్‌పై సలహాలిచ్చింది. ‍అదే క్రమంలో అమ్మాయిలకు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. ‍పెళ్లి, పిల్లలు తర్వాతే అని ఉపాసన యువతను ఉద్దేశించి మాట్లాడింది. అంతేకాకుండా 30  అమ్మాయిలు తమ అండాలను భద్రపరచుకోవాలంటూ కామెంట్స్ చేసింది.

దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొందర సమర్థించగా.. మరికొందరు తప్పుబట్టారు. అందరి పరిస్థితి మీలా ఉండదని ఫైరయ్యారు. ఇలాంటి వాటితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఉపాసన షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్స్‌ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేశారు. ఉపాసన కామెంట్స్‌తో నెగెటివిటీ పెరగడంతో తాజాగా ఆమె స్పందించింది. ట్విటర్ వేదికగా  పోస్ట్ చేసింది.

నేను చేసిన కామెంట్స్‌పై ఆరోగ్యకరమైన చర్చ జరిగినందుకు సంతోషంగా ఉన్నా.. మీ గౌరవప్రదమైన స్పందనలకు ధన్యావాదాలు అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. మీరందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులు/ఒత్తిళ్లపై నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తున్నప్పుడు వేచి ఉండండి.. ఇక్కడ నా ఫోటోలు చూడటం మర్చిపోవద్దు.. సరైన వ్యాఖ్యలు చేయడానికి మీకు సహాయపడే చాలా ముఖ్యమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి.. ఇక్కడ ఉన్న యజమానుల కోసం ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పని చేద్దామంటూ ట్విటర్‌లో రాసుకొచ్చింది.

అంతేకాకుండా సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?.. పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అంటూ తనపై వచ్చిన విమర్శలపై పలు ప్రశ్నలను సంధించింది ఉపాసన.  అంతేకాకుండా ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో ఓ నోట్‌ను కూడా ఉపాసన షేర్ చేసింది. నాకు 27 ఏళ్ల వయసులో పెళ్లయిందని తెలిపింది. నా 29 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాలతో ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకున్నట్లు తెలిపింది. నాకు 36 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టిందని.. ఇప్పుడు 39 ఏళ్లకు ట్విన్స్ పుట్టబోతున్నారని వెల్లడించింది. నా జర్నీలో కెరీర్‌.. పెళ్లి సమానంగా మేనేజ్ చేశానని ఉపాసన తెలిపింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement