ఎన్నికల ఫలితాల్లో సూపర్ హిట్.. 'జన నాయగన్‌' సంగతేంటి? | TVK Vijay Victory And All Clear For Jana Nayagan Release | Sakshi
Sakshi News home page

Jana Nayagan TVK Vijay: జాక్‌పాట్ కొట్టబోతున్న 'జన నాయగన్‌'?

May 4 2026 1:50 PM | Updated on May 4 2026 2:28 PM

TVK Vijay Victory And All Clear For Jana Nayagan Release

ఎవరూ ఊహించలేదు. తమిళ హీరో విజయ్.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఈ రేంజ్ ఆధిక్యం సాధిస్తాడని. ఎందుకంటే ఎన్నికల ముందు విజయ్‌కి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత విషయాలు పక్కనబెడితే ఇతడు నటించిన చివరి సినిమా 'జన నాయగన్‌'ని కూడా విడుదల కాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో విజయ్ అద్భుతం చేయడంతో ఈ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ‍ట్రెండింగ్‌లో త్రిష

లెక్క ప్రకారం 'జన నాయగన్‌' సినిమా ఈ ఏడాది జనవరి 9న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సమస్యల వల్ల అది వారం వారం ఆలస్యమవుతూ వస్తోంది. అలాంటిది కొన్నాళ్ల క్రితం ఏకంగా పూర్తి మూవీ పైరసీకి గురవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. దీంతో మూవీ త్వరగా రిలీజ్ అయిపోతే బాగుండు అని అభిమానులు అనుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు తమిళనాడులో విజయ్.. అధికారం చేజిక్కుంచుకుని ముఖ్యమంత్రి అయితే మాత్రం 'జన నాయగన్‌'కి మార్కెట్‌లో కచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది. అటు ఆడియెన్స్ కూడా విజయ్‌ని చివరిసారి వెండితెరపై చూడాలనే ఆసక్తి కనబర‌చొచ్చు. తద్వారా టాక్‌తో సంబంధం లేకుండా వంద రెండొందల కోట్ల కలెక్షన్స్ రావొచ్చేమో అనిపిస్తుంది. మరి సమస్యలని దాటి 'జన నాయగన్‌'.. ఈ నెలలోనే రిలీజ్ అవుతందా? లేదంటే జూన్‌లో వస్తుందా అనేది చూడాలి?

తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేకే 'జన నాయగన్‌'. విజయ్ లీడ్ రోల్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. హెచ్. వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతదర్శకుడు. ఇప్పటికే రిలీజైన కొన్ని పాటలు శ్రోతల్ని అలరించాయి కూడా.

ఇదీ చదవండి: త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా?

Advertisement
 
Advertisement
Advertisement