సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధముంది. ఎందుకంటే స్టార్స్‌గా చెలామణీ అయిన చాలామంది.. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అక్కడాఇక్కడా అని కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి స్టార్ హీరో దళపతి విజయ్ చేరబోతున్నాడు. తమిళనాడులోని అధికారం చేజిక్కుంచుకునే దిశగా విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యం చూపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే హవా బలంగా కనిపిస్తోంది. ఇదే టైంలో త్రిష, రాజకీయ రంగప్రవేశంపై కూడా చర్చ జరుగుతోంది.
(ఇదీ చదవండి: దళపతి విజయ్‌కి మరో షాక్.. రూ.70 కోట్ల నష్టం?)
టీవీకే అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయం! అదే జరిగితే హీరో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు! ఇకపోతే ఎన్నికలు జరగడానికి ముందు విజయ్ విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అదే టైంలో త్రిషతో కలిసి జంటగా విజయ్ ఓ పెళ్లికి హాజరవడం వీళ్ల గురించి వినిపించిన రూమర్స్ నిజమేనేమో అనే సందేహాలు కలుగజేసింది. ఒకవేళ విజయ్ అధికారం దక్కించుకుంటే త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా అనిపిస్తుంది.
ఎందుకంటే గతంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష.. సరదాగానే అన్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని చెప్పుకొచ్చింది. మరి సీఎం కాకపోవచ్చు గానీ విజయ్ తలుచుకుంటే ఈమెకు కచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వకపోడా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి త్రిష మనసులోనూ రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమైనా ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.
ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే గెలవడం దాదాపు ఖాయంలానే కనిపిస్తుంది. చిత్రం ఏంటంటే ఈరోజే త్రిష పుట్టినరోజు కూడా. తిరుమల వెళ్లి ఉదయమే వేంకటేశ్వర స్వామిని ఈమె దర్శించుకుంది. అయితే విజయ్ కోసమే ఈమె తిరుమల వెళ్లిందని, ప్రత్యేక పూజలు కూడా చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)
Happy birthday to the Chief Minister of Tamil Nadu. #Trisha 🔥🥶#HBDTrisha ❣#HBDSouthQueenTrisha 💥 pic.twitter.com/SvSkDR7nm1
— CricFDFS (@lokiMSD93) May 4, 2026


