నంది అవార్డు గ్రహీత, కెమెరామెన్‌ కన్నుమూత | Telugu Serial Cameraman Venkata Ramana Passed Away - Sakshi
Sakshi News home page

బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కెమెరామన్‌ కన్నుమూత

Apr 4 2024 3:52 PM | Updated on Apr 4 2024 4:55 PM

TV Cameraman Venkata Ramana Passed Away - Sakshi

సీనియర్ టీవీ కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ అనారోగ్యంతో బుధవారం (మార్చి 3) మరణించారు. శ్వాస సంబంధ సమస్యతో మంగళవారంనాడు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంటక రమణ స్వస్థలం మచిలీపట్నం. ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు, మొదలగు ప్రజాదరణ పొందిన పలు సీరియల్స్‌కు కెమెరామెన్‌గా పనిచేశారు.

ఎస్‌వీబీసీ ఛానల్ నిర్మించిన “శ్రీ వైనతేయ” ధారావాహికకుగానూ 2009లో ఉత్తమ కెమెరామెన్‌గా నంది పురస్కారం అందుకున్నారు. పూరి జగన్ తొలిసారి దర్శకత్వం వహించిన దూరదర్శన్ టెలీఫిలిమ్ “జీవితం" కు పోతన వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి టివి కెమెరామెన్‌ సంఘంతో పాటు బుల్లితెర ఇండస్ట్రీలోని పలువురు సంతాపం తెలిపారు. మచిలీపట్నంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

చదవండి: డేరింగ్‌ స్టంట్స్‌.. అజిత్‌ కారు ప్రమాదం వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement