బుల్లితెర నటి వాబిజ్ దొరబ్జీ (Vahbbiz Dorabjee) ఒంటరిగానే కాలం వెళ్లదీస్తోంది. గతంలో ఆమెకు నటుడు వివియన్ డిసేనతో పెళ్లయింది. 2013లో వీరి వివాహం జరగ్గా దాదాపు ఎనిమిదేళ్లపాటు కలిసున్నారు. 2021 డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు. కానీ, ఈ విడాకుల తర్వాత నటిపై చాలా ట్రోలింగ్ జరిగింది. తను భారీగా భరణం డిమాండ్ చేసిందని, ఆ డబ్బు కోసమే వివియన్‌ను వలలో వేసుకుందని విమర్శించారు. ఇప్పటికీ అలాంటి కామెంట్స్ చేస్తున్నవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది వాబిజ్.
అందులో తప్పేముంది?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాబిజ్ దొరబ్జీ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకునే ప్రతి మహిళ తనకు భర్త దగ్గర ఆర్థిక భద్రత ఉందా? లేదా? అని చూసుకుంటుంది. అంతమాత్రానికే తను గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసమే పురుషలతో సంబంధం పెట్టుకోవడం) ఎలా అవుతుంది? నిజానికి నేటికాలం పురుషులు చాలా అదృష్టవంతులు. ఈరోజుల్లో మహిళలు బాగా సంపాదిస్తున్నారు, మీతో సమానంగా పని చేస్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదా చెడు కనిపించడం లేదు.

వాళ్లు చాలా డేంజర్
జీవిత భాగస్వామి దగ్గర స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను కోరుకోవడం తప్పేం కాదు. దానికి గోల్డ్ డిగ్గర్ అని ముద్ర వేస్తున్నారంటే వారికి ఆ పదం అర్థమే తెలిసుండదు. ఈరోజుల్లో చాలామంది మగవాళ్లు మనగురించి అంతా తెలుసుకుని మనతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటారు. వారికి డబ్బు అవసరమైనప్పుడల్లా.. కాస్త మనీ ఇస్తావా? అని అడుగుతుంటారు. అలాంటి వాళ్లు చాలా డేంజర్. కొందరు అలా నా దగ్గర డబ్బు కొట్టేయాలని చూశారు.
అన్నింటిపైనా కన్నేశాడు
ఒక వ్యక్తి అయితే నాకు పెద్ద టోపీ పెట్టాలని చూశాడు. ఎమోషనల్ డ్రామాలాడి ఒకటీరెండుసార్లు నా దగ్గర డబ్బు తీసుకున్నాడు. తర్వాత ఆలోచిస్తే అతడు నా దగ్గరున్న డబ్బు, ఇల్లు.. ఇలా అన్నింటిమీదా కన్నేశాడని అర్థమైంది. ఇలాంటివాళ్లే అసలైన గోల్డ్ డిగ్గర్స్ అని చెప్పుకొచ్చింది. వాబిజ్ దొరబ్జీ.. ప్యార్‌కీ యే ఏక్ కహానీ, సావిత్రి, సరస్వతిచంద్ర, బాహు మహారీ రజనీకాంత్, దీవానియత్ వంటి పలు సీరియల్స్ చేసింది.
చదవండి: పూటకు గతి లేక మట్టి బుక్కేది: ఏడ్చేసిన ఇమ్మాన్యుయేల్


