గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం.. ఫోటోలు వైరల్! | Tv Actress Mohena Singh Baby Shower Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!

Mar 28 2024 7:03 PM | Updated on Mar 28 2024 7:32 PM

Tv Actress Mohena Singh Baby Shower Photos Goes Viral - Sakshi

యే రిష్తా క్యా కెహ్లతా హై అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి మోహెనా కుమారి సింగ్. ఆ తర్వాత నయా అక్బర్ బీర్బల్, సిల్సిలా ప్యార్ కా, ప్యార్ తునే క్యా కియా, కుబూల్ హై లాంటి సిరీస్‌ల్లో కనిపించింది. ఆ తర్వాత సుయేష్ రావత్‌ను 2019లో వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే అయాన్ష్‌ అనే బాబు కూడా ఉన్నారు .

తాజాగా బుల్లితెర భామ మోహెనా సింగ్‌ రెండోసారి గర్భం ధరించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న బేబీ బంప్‌ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా మోహెనా కుమారి సింగ్‌కు సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  అయితే ఆమె కేవలం నటిగా మాత్రమే కాదు.. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement