పదేళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ.. గ్రాండ్‌గా బుల్లితెర నటి సీమంతం..! | Tv actress Divyanka Tripathi Radiates Baby Shower event Goes Viral | Sakshi
Sakshi News home page

Divyanka Tripathi: గ్రాండ్‌గా బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి సీమంతం

Mar 24 2026 4:20 PM | Updated on Mar 24 2026 4:32 PM

Tv actress Divyanka Tripathi Radiates Baby Shower event Goes Viral

ప్రముఖ బుల్లితెర జంట దివ్యాంక త్రిపాఠి ఇటీవలే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వివేక్‌ దహియాను పెళ్లాడిన ముద్దుగుమ్మ దాదాపు పదేళ్లకు శుభవార్త పంచుకుంది. తాము త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందనున్నట్లు వెల్లడించింది.  ఉగాది పండుగ రోజే ఫ్యాన్స్‌కు గుడ్ ‍న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దివ్యాంక తన బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

తాజాగా ఈ బ్యూటీ సీమంతం వేడుక గ్రాండ్‌గా జరిగింది. సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను బేబీ షవర్‌ను సెలబ్రేట్ చేసుకుంది దివ్యాంక త్రిపాఠి. తాజాగా తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్తతో పాటు కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితులతో చేసుకున్న ఈ గోధ్ బరాయి(సీమంతం) వేడుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

2016లో ప్రేమ పెళ్లి..

కాగా..  దివ్యాంక, వివేక్‌.. యే హై మొహబ్బతే సీరియల్‌ సెట్‌లో కలుసుకున్నారు. ఈ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2016లో భోపాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట నాచ్‌ బలియే 8వ సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో దివ్యాంక తల్లి కాబోతోంది.

సీరియల్‌ నటిగా రికార్డ్..

దివ్యాంక త్రిపాఠి నటి మాత్రమే కాదు మోడల్‌, యాంకర్‌ కూడా! 2005లో మిస్‌ భోపాల్‌ కిరీటం అందుకుంది. బనూ మే తేరి దుల్హాన్‌ సీరియల్‌తో గుర్తింపు పొందింది. అలా వరుస ఛాన్సులు అందుకుంది. మధ్యలో తకనుమరుగైపోయినా యే హై మొహబ్బతే సీరియల్‌తో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. 2017లో ఫోర్బ్స్‌ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న సీరియల్‌ నటిగా రికార్డు సృష్టించింది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement