భాయ్‌ఫ్రెండ్‌ నన్ను ‘చెత్త’లా చూసేవాడు: హీరో కూతురు

Trishala Dutt Says My Boyfriend Treated Me Like Trash - Sakshi

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూతురు త్రిశాలా దత్‌ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్‌, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెర‌పిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. ఇటీవల తండ్రి డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెబుతూ అందులోంచి బయటకు రావడానికి తన సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్‌ మీ ఎనీథింగ్‌ సెషన్‌లో పాల్గొన్నారు త్రిశాలా. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడైనా  తప్పులు చేశారా అని ఓ వ్యక్తి ఆమెను అడిగాడు. దీనిపై త్రిషాల స్పందిస్తూ.. గతంలో ఓ వ్యక్తితో తను ఎదుర్కొన్న భయంకర అనుభవం, మానసిక వేదన గురించి సుదీర్ఘంగా వెల్లడించారు. దీనికి సమాధానం చెప్పాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలని తెలుపుతూ.. తన అనుభవం ఎదుటివాళ్లకు తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఎప్పుడూ అందరితో నిజాయితీగా ఉండాలని సూచించారు. చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం

‘కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో నేను ‘డేటింగ్’‌ చేశాను. డేటింగ్‌ అనే పదాన్ని ఎందుకు కోట్స్‌లో పెట్టానంటే.. నిజానికి నాతో నేనే డేటింగ్‌ చేశాను. అతనితో కలిసుంటే మంచిదని నేను తనను భాయ్‌ఫ్రెండ్‌గా ఒప్పించా. డేటింగ్ గురించి ఆలోచించ‌మ‌ని ఓ వారం టైం ఇచ్చిన‌ట్టు గుర్తుంది. అప్పుడు నా మీద నాకు గౌర‌వం లేదు. నాకు ఎలాంటి హ‌ద్దులు లేవు. అయితే కొంత‌కాలం త‌ర్వాత‌ బాయ్‌ఫ్రెండ్ న‌న్ను ప‌నికిరాని చెత్తలా చూడ‌టం ప్రారంభించాడు. నేను కేవలం అతడికి ఆ రోజు బాలేదని అనుకునేదాన్ని. రేపైనా బాగుంటాడేమోన‌ని అనుకునేదానిని. కానీ అత‌నిలో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు. రోజురోజుకీ ఇంకా దిగజారి ప్రవర్తించేవాడు. చదవండి: ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ రాబోతుందా!

నాకు తెలియ‌కుండా అత‌డు నెమ్మదిగా నా స్నేహితుల నుంచి న‌న్ను వేరు చేశాడు. నేను ఎప్పుడు బయటికి వెళ్లినా.. ఇంటికి వచ్చేట‌పుడు అతనికి మెసేజ్ చేస్తాను. దానికి అత‌డు ఓ  ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తారా..? అంటూ ' (వింక్ ఎమోజి) దూషించేవాడు. ఏదో చేయకూడని పని చేసినట్లు నేను ఫీల్‌ అయ్యేదాన్ని. నన్ను నేను నిరూపించుకోడానికి నా స్నేహితులతో తిరగడం మానేశాను. నేను ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. ఆ తరువాత చాలా కాలం అలా ఉండిపోయాక ఈ సంబంధంలో ఎందుకు ఉండిపోయానని ఆలోచించాను. నన్ను నేను విషపూరిత ప్రవర్తించాను. నాకోసం నేను నిలబడకుండా ఆ వ్యక్తిని నాపై అలా మాట్లాడేందుకు అనుమతిచ్చాను. కానీ తనెంటో, అత‌ని గురించి నాకు బాగా తెలుసు. తన నుంచి దూరం అయ్యాక నా ప్రవర్తనను అంగీక‌రించి.. సిగ్గు ప‌డ్డా. చాలా విష‌యాలు నేర్చుకుని ఇప్పుడు మీ ముందు నిల‌బ‌డ్డా’ అంటూ త‌న గ‌తం గురించి చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top