ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు.. వాడినే పెళ్లి చేసుకుంటా: త్రిప్తి డిమ్రి | Actress Tripti Dimri Gives Clarity About Her Dating And Marriage Rumors In Recent Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Tripti Dimri Marriage Rumours: ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు.. వాడినే పెళ్లి చేసుకుంటా

Feb 1 2024 8:09 AM | Updated on Feb 1 2024 10:50 AM

Tripti Dimri Clarifies About Her Marriage Rumors - Sakshi

'యానిమల్‌' సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్‌ స్టార్‌ అయింది బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి. సోషల్‌ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్‌ పెరిగిపోయారు. ఇప్పుడు యానిమల్‌ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఆమె మళ్లీ భారీగా వైరల్‌ అవుతుంది. సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్‌ - త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు వైరల్‌గా మారాయి. దీంతో ఎందరో ఆమెకు ఫ్యాన్స్‌ అయిపోయారు.

త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుందని వార్తలు నెట్టింట భారీగానే వైరల్‌ అయ్యాయి. ఇప్పటికే డేటింగ్‌లో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. పెళ్లి రూమర్స్‌పై ఓ ఇటర్వ్యూలో త్రిప్తి డిమ్రి క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలపై ఆమెను ఇంటర్వ్యూలో యాంకర్‌ ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్‌ పైనే ఫోకస్​ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. కానీ తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. అతనికి డబ్బు, పాపులారిటీ వంటివి లేకున్నా ఫర్వాలేదు కానీ మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు అని కాబోయే భర్తపై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

యానిమల్‌’ కంటే ముందే త్రిప్తి డిమ్రి పలు ఓటీటీలలో నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా ఓటీటీని మాత్రం నిర్లక్ష్యం చేయనని తెలిపింది. త్రిప్తి డిమ్రికి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి  తెరకెక్కించనున్న చిత్రంలోనూ  ఆమెకు ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement