అందుకే రాజీనామా చేశా! | Sakshi
Sakshi News home page

అందుకే రాజీనామా చేశా!

Published Tue, Nov 21 2023 1:42 AM

the trial movie release on november 24 - Sakshi

‘‘ఇప్పటిదాకా మనకు మొత్తం సినిమాని ఇంటరాగేషన్‌ మీద తీయలేదు. ‘ది ట్రయల్‌’ సినిమా కథ ఇంటరాగేషన్‌ రూమ్‌ నుంచి మొదలై అదే గదిలో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ ఫస్ట్‌ ఇంటరాగేటివ్‌ ఫిల్మ్‌ అంటున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్‌ గన్ని. స్పందనా పల్లి, యుగ్‌ రామ్, వంశీ కోటు లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ది ట్రయల్‌’. స్మృతీ  సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు.

సుదర్శన్‌ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. దర్శకుడు రామ్‌ గన్ని మాట్లాడుతూ– ‘‘2012 నుంచి 2022 వరకు డిప్యూటీ జైలర్‌గా చేశాను. సినిమాలపై ఫ్యాషన్‌తో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకునిగా ‘ది ట్రయల్‌’ నా తొలి చిత్రం. డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్‌లో ఎన్నో నేర ఘటనల గురించి, ఆ నేరాలు చేసిన ఖైదీల కథలను విన్నాను. వాటి స్ఫూర్తితో ఫిక్షనల్‌గా రాసుకున్న కథ ‘ది ట్రయల్‌’’ అన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement