ఓటీటీలు వచ్చాక హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా తెలుగులోనూ సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సందడి చేసేందుకు వస్తోంది. జస్విని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తామని ఆహా వెల్లడించింది.


